ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో వివాదం..

దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబందించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ ఫైట్ సీన్ కోసం చేసిన ఖర్చు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. నిర్మాత దానయ్య ఏ మాత్రం వెనకాడకుండా ఒక ఫైట్ సీన్ కోసమే ఏకంగా 45 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ రేంజ్‌లో షూట్ చేస్తున్నారంటే ఈ ఫైట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల పోరాట సన్నివేశాలు ఎలా ఉండనున్నాయో అర్థం చేసుకోవచ్చు.

మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఇందులో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తోందట. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు దాదాపు 2 వేల మందితో కలిసి ఫైట్‌ చేయబోతున్నారట. ఈ ఒక్క యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం కొన్ని వందల మంది యూనిట్‌ సభ్యులు ఆరు నెలలపాటు శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. వందల మంది విదేశీయులతో, భారీ సెట్‌లో రెండు నెలల పాటు ఈ ఫైట్ షూట్‌ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజమౌళి టేకింగ్ లో భారీ ఫైట్ సీన్ అందునా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ఇద్దరూ పార్టిసిపేట్ చేయడం అంటే ఈ ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడం సాధ్యపడదు. కాకపోతే ఈ భారీ ఫైట్ సీన్ చెర్రీ, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పెద్ద పండగే అని మాత్రం చెప్పగలం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 More posts in FILMY category
Recommended for you
Rajinikanth 2.0 – Official Telugu Trailer

Rajinikanth 2.0 - Official Telugu Trailer   Unleashing the Official Trailer of our Magnum Opus...